YSR Ghat: వైయస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి..! 12 d ago
మాజీ సీఎం వైయస్ జగన్ బెంగళూరు నుంచి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. జగన్‌కు పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికారు. ముందుగా తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడి నివాసంలో బస చేయనున్నారు.